Shakeela: లైంగిక వేధింపులు టాలీవుడ్‌లోనే ఎక్కువ
Shakeela: మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసారు నటి షకీలా. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందని అన్నారు. అన్ని పరిశ్రమల కంటే ఎక్కువ ఈ లైంగిక వేధింపులు టాలీవుడ్‌లో ఉన్నాయని అన్నారు.
“” బాలీవుడ్‌లో అయితే నటీనటులు కానీ నిర్మాతలు, దర్శకులు కానీ కలుసుకోగానే ఫ్రెండ్స్ అయిపోతారు. కాబట్టి అక్కడ ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. కానీ టాలీవుడ్‌లో అలా కాదు. అక్కడ నిర్మాతలు కానీ దర్శకులు కానీ ముందు హీరోయిన్ మేనేజర్‌ను సంప్రదించి తమకు కావాల్సింది ఇస్తేనే సినిమాలో నటించే అవకాశం ఉంటుందని బెదిరింపులకు పాల్పడతారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో పురుషులకు వార్నింగ్ ఇవ్వాల్సిందే “” అని వెల్లడించారు.