Shahrukh Khan: ఛీ ఛీ.. ఏం మాట్లాడాలో కూడా తెలీదు..!
ఎంత పేరు, డబ్బు, పలుకుబడి ఉండి ఏం లాభం. ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీకపోతే ఎన్ని ఉన్నా దండగే. మనం ప్రవర్తించే విధానమే చెప్తుంది మనం ఎలాంటి వాళ్లం అని. ఇదంతా ఎవరి గురించి దేని గురించి అనుకుంటున్నారా? ఇంకెవరు.. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (shahrukh khan). ఆయనకు ఎంత పేరుందో.. ఎంత స్టార్‌డం ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న జవాన్ ట్రైలర్ రిలీజ్ సమయంలో షారుక్.. డైరెక్టర్ అట్లీ గురించి అతని భార్య ప్రియ గురించి ప్రస్తావించిన తీరు ఆయన హుందాతనానికి తగ్గట్టుగా లేదు.
ట్రైలర్ రిలీజ్ సమయంలో షారుక్ మాట్లాడుతూ.. ప్రియ.. నేను నీ గురించి తర్వాత మాట్లాడతాను. మనం కలిసి ఇంకో బిడ్డని ప్రొడ్యూస్ చేద్దాం. సారీ అదే.. నువ్వు అట్లీ ఇంకో బిడ్డను ప్రొడ్యూస్ చేయండి.. అని వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలు ఎవ్వరితోనూ ఎప్పుడూ మాట్లాడకూడదు. అందులోనూ పబ్లిక్‌గా స్టేజ్ ఎక్కి మరీ ఇలా వేరొకరి పర్సనల్ విషయాలు అసలు ప్రస్తావించకూడదు. షారుక్ చేసిన కామెంట్స్‌కి ప్రియ, అట్లీ తప్పకుండా ఇబ్బందిపడి ఉంటారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఏమన్నా అంటే జోక్‌గా అన్నాను.. సీరియస్‌గా తీసుకోకండి అంటారు. ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు పర్సనల్‌గా అయినా ఇలా ఇంకెప్పుడూ చేయకండి అని చెప్పడానికి కూడా వారు సందేహించి ఉంటారు. అయినా ఈ బాలీవుడ్ వాళ్లకి ఇలాంటి కొత్తేం కాదు. జోక్ జోక్ అంటూనే పక్కవారి పర్సనల్ విషయాలను నలుగురిలో బయటపెట్టేస్తారు. ఏం మనుషులో ఏంటో..! (shahrukh khan)