Shahrukh Khan వల్లే బాలీవుడ్ నాశనమైపోయింది
బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (vivek agnihotri) మరోసారి కాంట్రొవర్షియల్ కామెంట్స్ చేసారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ (shahrukh khan) వల్లే బాలీవుడ్ నాశనమైపోయిందని అన్నారు. షారుక్ అంటే తనకు ఇష్టమని కాకపోతే బాలీవుడ్‌లో ఆయన చేసే రాజకీయాలు అన్నీ ఇన్నీ కావని అన్నారు. “” షారుక్ బాలీవుడ్‌ని నాశనం చేసాడు. పీఆర్, హైప్, గ్లామర్, స్టార్‌డం లాంటివి బాలీవుడ్‌కి పరిచయం చేసింది షారుకే. ఒకప్పుడు బాలీవుడ్ ఎంతో హెల్తీగా ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రీనే సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు స్టార్‌డం లేకపోతే ఏదీ లేదు. నాకు అదే నచ్చడంలేదు “”
“” నాకు నచ్చని మరో విషయం ఏంటంటే.. ప్రేక్షకులు ఏమీ తెలీని వెదవలు అని అనుకునే యావరేజ్ నటులు ఉన్నారు. నేను ప్రజల కోసం సినిమాలు తీస్తాను. వాళ్లు బాక్సాఫీస్ దగ్గర వచ్చే కలెక్షన్ల కోసం తీస్తారు. వారు తీసే సినిమా సక్సెస్ అయితే అది షారుక్ ఖాన్ సినిమా కాబట్టి సక్సెస్ అయింది అంటారు. నా సినిమా సక్సెస్ అయితే మాత్రం ఇది ప్రజల సినిమా కాబట్టి అయింది అంటాను. షారుక్ నాతో పనిచెయ్యరు. ఎందుకంటే ఆయన నా విధానంలో నాతో కలిసి పనిచేస్తే ఓకే. కానీ ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో నేను, స్క్రిప్ట్ రైటర్ ఫోర్ గ్రౌండ్‌లో ఉంటేనే ప్రాబ్లం. సినిమాలో ఒక వ్యక్తి హైలైట్ అవుతున్నాడు అంటే ఆ వ్యక్తితో కలిసి షారుక్ అస్సలు పనిచేయరు “‘ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు వివేక్.