‘పఠాన్’తో ప్రభాస్‌ని దాటేసిన షారుఖ్!
Mumbai: కరోనా తర్వాత రిలీజైన బాలీవుడ్(Bollywood) సినిమాలు దాదాపుగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తూనే ఉన్నాయి. ఇటీవల రిలీజైన‘పఠాన్’(Pathan) సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టి రికార్డుల్ని తిరగరాసింది. దీంతో బాలీవుడ్‌కి కాస్త ఊరట లభించింది. ఏకంగా 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక,‘బాహుబలి2’ (Bahubali2) తర్వాత ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. బాలీవుడ్‌లోనూ ఆయనకు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగిపోయింది. కొంత కాలంగా రెమ్యునరేషన్ పరంగా ప్రభాస్ టాప్‌లో ఉండగా, తాజాగా ఈ రికార్డ్‌ను షారుఖ్ (Shah Rukh Khan) బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది
బాలీవుడ్‌లో సౌత్ సినిమాల హవా పెరిగింది. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ ప్రతి సినిమాకీ రూ. 120-150 కోట్ల మధ్య వసూలు చేస్తున్నాడని గతంలో రూమర్స్ వినిపించాయి. అదే టైమ్‌లో అక్షయ్ కుమార్, కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ దళపతి వంటి బడా స్టార్లు రూ. 70-100 కోట్ల మధ్య రెమ్యునరేషన్‌కు డిమాండ్ చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. కానీ తాజా రిపోర్ట్స్ ప్రకారం.. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన చివరి చిత్రానికి గాను దాదాపు రూ. 200 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. షారుఖ్ హీరోగా నటించిన ‘పఠాన్’ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే షారుఖ్.. ‘పఠాన్’ డొమెస్టిక్ రెవెన్యూలో 60% షేర్ తీసుకున్నట్లు తెలిసింది. ఇది దాదాపు రూ. 200 కోట్లకు సమానం. దీంతో ప్రస్తుతం ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే సూపర్ స్టార్‌గా నిలిచారు షారుఖ్.