Suhana Khan: నా తండ్రి వల్ల వచ్చే గుర్తింపు అక్కర్లేదు!
Mumbai: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) గారాలపట్టి సుహానా ఖాన్(Suhana Khan). సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుహానా గురించి అందరికీ తెలిసిందే. ఈ భామ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్ డైరెక్ట్ చేస్తున్న ‘ది ఆర్చీస్’ (The Archies) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాగా ఆదివారం (మే 22) సుహానా తన 23వ పుట్టినరోజు జరుపుంది. ఈ సందర్భంగా షారుఖ్ కూడా సోషల్ మీడియా వేదికగా కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సుహానా షారుఖ్ ఖాన్ కూతురుగా వచ్చే గుర్తింపు తనకి అవసరం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘నాకు ఐదేళ్ళ వయసు వచ్చే వరకు నా తండ్రి షారుఖ్ అంత ఫేమస్ అనే విషయం తెలియదు. అయితే ఒకసారి నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు.. అందరూ తననే చూస్తూ ఉన్నారు. షారుఖ్ ఖాన్ కూతురి అందరూ నన్ను చూడటం నాకు నచ్చలేదు. వెంటనే మా నాన్నను అక్కడ నుంచి పంపించేశా. అప్పుడే నాకు నేనుగా నిర్ణయించుకున్నా.. మా నాన్న వల్ల వచ్చే గుర్తింపు నాకు అవసరం లేదు” అని చెప్పుకొచ్చింది సుహానా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పఠాన్(Pathan) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న షారుఖ్ ప్రస్తుతం జవాన్ (Jawan), డంకీ (Dunki) సినిమాల్లో నటిస్తున్నారు. జవాన్ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee) రూపొందిస్తుండగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) హీరోయిన్గా నటిస్తోంది.