Review: శాకుంతలం
Hyderabad: స్టార్ హీరోయిన్ సమంత(samantha) నటించిన సినిమా శాకుంతలం(shaakuntalam). గుణశేఖర్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో ఈ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
కాళిదాసు రచించిన సాంస్కృతిక నాటకం అభిజ్నాన శాకుంతలం అందరికీ తెలిసిన కథే. అందులో శకుంతల, దుష్యంత మహారాజు ప్రేమ కథ ఎంతో అందంగా ఉంటుంది. అయితే ఆ నవల చదువుతున్నప్పుడు మనం ఊహించుకునే అందమైన లోకంతో పోల్చుకుంటే శాకుంతలం సినిమా అంత బాగా రాలేదనే చెప్పాలి.
శకుంతల(review) పాత్రకు సమంత ఏమాత్రం సరిపోలేదు. అఫ్‌కోర్స్ సమంత తన పాత్ర కోసం పడిన శ్రమ స్క్రీన్‌పై 100% కనిపించింది. కాకపోతే ఇది మిగతా కమర్షియల్ సినిమాల లాగా కాదు కాబట్టి.. సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోకుండా ఉండాల్సింది. అప్పుడే మనం చూస్తున్నది సమంతను కాదు అనే ఫీల్ ఆడియన్స్‌కి కలుగుతుంది. ఇందులో దుష్యంతుడి పాత్రలో నటించిన దేవ్ మోహన్ నటన కూడా కాస్త ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది.
ఇక సినిమాలో కీ రోల్ దుర్వాస మహర్షిది. ఈ పాత్రకు గుణశేఖర్ మోహన్‌బాబును ఎంపికచేసుకుని మంచి పని చేసారు. ఆయన స్క్రీన్‌పై కనిపించేది కొంతసేపే అయినా చాలా బాగా నటించారు. ఇందులో చాలా మంది తెలిసిన నటీనటులు ఉన్నప్పటికీ ఎవరి క్యారెక్టర్‌కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఫలానా క్యారెక్టర్ సూపర్‌గా ఉంది.. సినిమాలో అదే హైలైట్ అని చెప్పుకునేలా ఏ క్యారెక్టర్ లేదనే చెప్పాలి.
రుద్రమదేవి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ నుంచి చాలా ఆశించి ఉంటారు ఫ్యాన్స్. కానీ ఆయన ఈ తరం వారికి చెప్పాలనుకున్న పౌరాణిక కథను కేవలం VFX జోడించి సాదీసీదాగా చూపిస్తారని అస్సలు ఊహించలేదు. ఏదేమైనా ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి.. శాకుంతలం సినిమాను సరదాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఒకసారి చూడచ్చు.