Shaakuntalam: డిజాస్టర్​ సినిమాకి అవార్డులా!

Hyderabad: టాలీవుడ్​ హీరోయిన్​ సమంత(Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం(Shakuntalam). ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్(Guna Shekar) దర్శకత్వంలో శాకుంతలం సినిమా తెరకెక్కింది. సమంత, దేవ్ మోహన్(Dev Mohan), మోహన్ బాబు(Mohan Babu), అల్లు అర్హ(Allu Arha), అనన్య నాగళ్ళ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించిన శాకుంతలం సినిమాని భారీ అంచనాల నడుమ రిలీజ్​ చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అంతేకాదు సమంత కెరీర్​లోనే బిగ్గెస్ట్​ డిజాస్టర్​గా మిగిలిపోయింది. శాకుంతలం రిలీజయి నెల అవ్వకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం శాకుంతలం సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కాగా ఈ సినిమాకు పలు అవార్డులు వచ్చాయంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ పోస్టర్ లో శాకుంతలం సినిమా..న్యూయార్క్ ఫిలిం ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2023 లో.. బెస్ట్ ఫాంటసీ ఫిలిం, బెస్ట్ మ్యూజికల్ ఫిలిం అవార్డ్స్, అమెరికన్ గోల్డెన్ పిక్చర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 ఏప్రిల్ లో – బెస్ట్ ఫిలిం ఆన్ వుమెన్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ సినిమాటోగ్రఫీ ఫీచర్ ఫిలిం, బెస్ట్ ఫీచర్ నేరేటివ్ అవార్డ్స్, ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 ఏప్రిల్ లో – బెస్ట్ డైరెక్టర్ ఫీచర్ ఫిలిం(స్పెషల్ జ్యూరీ), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డ్స్, కాన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ 2023 ఏప్రిల్ – అఫీషియల్ సెలక్షన్.. ఇలా పలు అవార్డులు వచ్చినట్టు పోస్టర్ వేశారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

అయితే ఓ డిజాస్టర్ ఫిలింకి ఎక్కడో విదేశాల్లో ఎవరికీ తెలియని అవార్డులు వచ్చాయని పోస్టర్స్ వేసుకొని ప్రమోట్ చేస్తున్నారని నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాను దిల్​ రాజు(Dil Raju), నీలిమ గుణ సంయుక్తంగా నిర్మించారు.