Dil Raju: శాకుంతలం.. నా కెరీర్‌కే షాకిచ్చింది
Hyderabad: టాలీవుడ్ క్వీన్ సమంత(samantha) నటించిన శాకుంతలం(shaakuntalam) సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిపోయింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు(dil raju) కూడా ఒప్పేసుకున్నారు. తన 25 ఏళ్ల కెరీర్‌లోనే శాకుంతలం పెద్ద జర్క్ ఇచ్చింది అని అన్నారు. ఓ సందర్భంలో శాకుంతలం గురించి మాట్లాడుతూ.. రిలీజ్ అయిన రోజే రెవెన్యూ రాలేదు. అంటే అప్పుడే అర్థం అయిపోయింది శాకుంతలం పోయిందని. నా 25 ఏళ్ల కెరీర్‌లోనే షాకిచ్చిన సినిమా అని చెప్పాలి. సినిమాకు ప్రీమియర్ షోలు వేసినా కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏమీ లేదు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసారు. ఏ భాషలోనూ శాకుంతలం మెప్పించలేకపోయింది. గుణశేఖర్ ఎంతో శ్రద్ధగా ఎక్కడా రాజీపడకుండా డైరెక్ట్ చేసినప్పటికీ ఫెయిల్ అయిపోయింది. ఈ సినిమాను దిల్ రాజు రూ.80 కోట్లతో నిర్మించారు. దాంతో కలెక్షన్ల విషయంలో ఆయనకు పెద్ద నష్టమే వచ్చిందని టాక్. ఆల్రెడీ సినిమా ఫ్లాప్ అయిన విషయాన్ని సమంత కొన్ని రోజుల క్రితమే యాక్సెప్ట్ చేసేసారు. పని చేయాలని కానీ ఫలితం ఆశించకూడదు అని భదవద్గీతలోని ఓ శ్లోకాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసారు. ఈ సినిమాలో మేనక క్యారెక్టర్‌లో నటించిన మధుబాల కూడా సినిమా ఫ్లాప్ అయినందుకు ఎంతో బాధపడ్డానని చెప్పారు.