Shaakuntalam: OTT రిలీజ్​ ఎప్పుడో తెలుసా!

Hyderabad: ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్​తో తెరకెక్కిన మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’(Shaakunthalam). గుణశేఖర్(Gunashekar)​ దర్శకత్వంలో సమంత(Samantha) ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. టీజర్​, ట్రైలర్​.. సినిమా గురించి చిత్రబృందం ప్రమోషన్స్​లో పంచుకున్న విషయాలు చూసి మంచి హిట్​ అవుతుందని అనుకున్నారు ప్రేక్షకులు. అయితే, మొదటి షో నుంచే నెగెటివ్​ టాక్ రావడంతో, ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా నెట్టింట ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యిందని.. త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. శాకుంతలం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్(Amazon Prime) భారీ రేటుకు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను మే మొదటి వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ఒక భారీ సినిమా రిలీజ్ అయిన అతి తక్కువ సమయానికే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తుందని తెలియడంతో సినిమాపై మరింత నెగెటివిటీ పెరిగిపోతోంది. ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించగా, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు(Mohan Babu), మధుబాల, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ(Mani Sharma) సంగీతం అందించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun)​ కూతురు అల్లు అర్హ(Allu Arha) భరతుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాను దిల్​ రాజు(Dil Raju), నీలిమ గుణ సంయుక్తంగా నిర్మించారు. థియేటర్లలో డిజాస్టర్​ టాక్​ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ(OTT)లో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి మరి.