Chandramohan: న‌టుడు చంద్ర‌మోహ‌న్ క‌న్నుమూత‌

Chandramohan: ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్ (80) క‌న్నుమూసారు. కొంత‌కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఈరోజు ఉద‌యం 9:45 గంట‌ల స‌మ‌యంలో కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో తుదిశ్వాస విడిచారు.  సోమ‌వారం హైద‌రాబాద్‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.