7G Brindavan Colony: ట్రాజిక్ లవ్‌స్టోరీ సీక్వెల్ ఫిక్స్!
Hyderabad: 7G బృందావన కాలనీ(7G brindavan colony) యువతను ఆకట్టుకున్న ట్రాజిక్ లవ్‌స్టోరీ. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం కొడుకు రవి కృష్ణ (Ravi Krishna) ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. 7G బృందావన్ కాలనీ సినిమాను తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ డైరెక్ట్ చేశారు. తమిళంలో తెరకెక్కినా తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా కామెడీ సీన్లు, పాటలు ఏదో ఒక చోట వినపడతాయంటే వాటికున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. సునీల్ శెట్టి(Sunil Shetty) కామెడీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది.
సోనియా అగర్వాల్ (Sonia Agarwal) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సీనియర్ నటుడు చంద్రమోహన్ హీరో తండ్రి పాత్రలో కనిపించారు. వీరిమధ్య ఉండే తండ్రీకొడుకుల బంధం మిడిల్ క్లాస్ కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని ప్రతి పాట హిట్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకి రీమేక్ తీసుకు రాబోతున్నారు మేకర్స్. దర్శకుడు సెల్వరాఘవన్ ఇటీవల ‘నేనే వస్తున్నా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. తన తదుపరి సినిమాగా 7G బృందావన్ కాలనీ సీక్వెల్ ని పట్టాలు ఎక్కిస్తున్నారట. ఫస్ట్ పార్ట్ లో హీరోగా కనిపించిన రవి కృష్ణ.. ఈ సీక్వెల్ లో కూడా మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ పార్ట్ లో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఎ.ఎం రత్నం నిర్మాణంలో యువన్ శంకర్ రాజా మ్యూజికల్ లో ఈ సీక్వెల్ రాబోతుంది. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ షురూ చేయనున్నారట. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రాబోతున్న ఈ సీక్వెల్ ఈ తరం యూత్‌ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.