Sayaji Shinde: ఏంజియోప్లాస్టీ చేయించుకున్న న‌టుడు

Sayaji Shinde: ప్ర‌ముఖ న‌టుడు స‌యాజీ షిండేకి ఏంజియోప్లాస్టీ స‌ర్జ‌రీ జ‌రిగింది. ఇటీవ‌ల ఆయ‌న‌కు గుండెలో నొప్పి రావ‌డంతో వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా వైద్యులు ఏంజియోప్లాస్టీ చేసారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నారు. మ‌హారాష్ట్ర‌లోని స‌తారా జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు.