Sarath Chandra: “మహర్షి”ని కూడా కాపీ కొట్టారు.. ఎవ్వరినీ వదలను
Sarath Chandra: సినీ రచయిత శరత్ చంద్ర సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన సినిమాలపై పడ్డారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తీసిన శ్రీమంతుడు (Srimanthudu) సినిమాను తాను గతంలో స్వాతి మ్యాగజైన్‌ను రాసిన చచ్చేంత ప్రేమ (Chachentha Prema) అనే కథ నుంచి కాపీ కొట్టారని ఆరోపిస్తూ కొరటాల శివపై కేసు వేసారు. నాంపల్లి హైకోర్టుకు ఈ కేసు విచారణకు రాగా.. కొరటాల శివ క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని తీర్పు వచ్చింది. దాంతో కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు.
ఈ నేపథ్యంలో కోర్టు బయట విషయాన్ని సాల్వ్ చేసుకుందామని శ్రీమంతుడు టీం శరత్ చంద్రను ఆశ్రయించారు. అడిగినంత డబ్బు కూడా ఇస్తాం అన్నారు. కానీ ఇందుకు శరత్ చంద్ర ఒప్పుకోలేదు. తనకు కొరటాల శివ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారు. మరోపక్క కొరటాల శివ కనీసం దీని గురించి ఎక్కడా కూడా ప్రస్తావించడంలేదు. రెండు కోర్టుల్లో కూడా తనకు న్యాయం జరగనప్పుడు తప్పు కొరటాల శివదే అయ్యి ఉండాలి. అలాంటప్పుడు తన తప్పును తెలుసుకుని శరత్ చంద్రకు (Sarath Chandra) క్షమాపణలు చెప్పేస్తే మ్యాటర్ ఇక్కడితో ఆగిపోతుంది. కానీ గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నట్లు ఉంది కొరటాల శివ పరిస్థితి.
మహర్షి కూడా కాపీనే..!
ఇప్పుడు శరత్ చంద్ర మరో ట్విస్ట్ ఇచ్చారు. శ్రీమంతుడు సినిమా మాత్రమే కాదు 2019లో వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేసిన మహర్షి (Maharshi) సినిమా కూడా కాపీనే అట. ఈ విషయాన్ని శరత్ చంద్ర స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కూడా తాను రాసిన చచ్చేంత ప్రేమ నవల నుంచి తీసుకున్నవే అని కనీసం తనకు క్రెడిట్ కూడా ఇవ్వలేదని శరత్ చంద్ర ఆరోపించారు. అయితే మొన్నటి వరకు శ్రీమంతుడు సినిమాపై మాత్రమే ఆరోపణలు చేసిన శరత్ చంద్ర ఇప్పుడు మహర్షిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో అర్థం కావడంలేదు. ఇదే విషయాన్ని శరత్ చంద్రను అడగ్గా.. తన నవలలోని ఎక్కువ భాగాన్ని శ్రీమంతుడు సినిమాలో వాడేసారని అందుకే ముందు ఈ విషయం తేల్చుకున్నాక మహర్షి సినిమా గురించి చర్చించాలనుకున్నానని తెలిపారు. శ్రీమంతుడు లీగల్ కేసు ఓ కొలిక్కి వచ్చాక అప్పుడు మహర్షి టీంపై కూడా కాపీరైట్ కేసు వేస్తానని హెచ్చరించారు.
కొరటాల శివపై ఫైర్
మరోపక్క మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JR NTR) ఫ్యాన్స్ కూడా కొరటాల శివపై మండిపడుతున్నారు. కొరటాల శివ వేరే కథలను లేపేసి తన కథగా చెప్పుకుని సినిమాలు తీయడం ఆయనకు అలవాటేనని ఆరోపిస్తున్నారు. శ్రీమంతుడు వివాదం కారణంగా కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న దేవర (Devara) సినిమాపై ఎక్కవ నెగిటివ్ ప్రభావం పడుతుందో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా శ్రీమంతుడు కేసును సెటిల్ చేసేసుకుని ఆ క్షమాపణలు చెప్పేస్తే ఇండస్ట్రీ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది కదా అని కామెంట్స్ పెడుతున్నారు.