Samantha యాడ్‌పై సానియా మీర్జా కామెంట్

Hyderabad: టాలీవుడ్ క్వీన్ స‌మంత(samantha) యాక్ట్ చేసిన ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌పై(pepsi ad) కామెంట్ చేసారు ప్ర‌ముఖ మాజీ టెన్నిస్ ప్లేయ‌ర్ సానియా మీర్జా(sania mirza). ఇటీవ‌ల స‌మంత యాక్ట్ చేసిన పెప్సీ యాడ్ క‌మ‌ర్షియ‌ల్ ఒక‌టి చాలా వైర‌ల్ అయింది. అమ్మాయిలకు న‌చ్చింది చేయాలి, ప్ర‌పంచం ఎప్పుడూ అమ్మాయిల‌ను తొక్కేయాల‌నే చూస్తుంటుంది అయినా బెద‌ర‌కుండా లేచి నిల‌బ‌డాలి అంటూ సామ్ ప‌వర్‌ఫుల్ డైలాగ్స్‌తో అద‌ర‌గొట్టింది. ఇందులో కొన్ని యాక్ష‌న్ సీన్ల‌లోనూ న‌టించింది. ఈ యాడ్‌పై సానియా రియాక్ట్ అయ్యారు.

“ఈ యాడ్ చూసాక చాలా మెమొరీస్ గుర్తొచ్చాయి. నేను టెన్నిస్ ప్లేయ‌ర్ అవుతా అన్న‌ప్పుడు అమ్మాయిలు టెన్నిస్ ఆడి ఏం సాధిస్తారు.. అది అమ్మాయిల కోసం కాదు.. అంటూ ఎన్నో మాట‌లు అన్నారు. కానీ నేను నా డ్రీమ్‌ని ఫాలో అయ్యాను. వ‌ద‌ల‌కుండా క‌ష్ట‌ప‌డ్డాను. నామీద వ‌స్తున్న చెత్త కామెంట్లు, అనుమానాలు, అవ‌మానాలు అన్నీ త‌ట్టుకుని ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. స‌మంత యాక్ట్ చేసిన రైజ్ అప్ బేబీ యాడ్ అనుకున్న‌ది సాధించాల‌న్న ప‌ట్టుద‌ల ఉండాలన్న సందేశాన్ని ఇస్తోంది. త‌మ క‌ల‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని క‌ష్ట‌ప‌డుతున్న ఎంద‌రో అమ్మాయిల‌కు పెప్సీ నుంచి వచ్చిన ఈ యాడ్ ఎంతో స్ఫూర్తిదాయ‌కం” అని కామెంట్ చేసారు.