Sandeep Reddy Vanga: “ఆ హీరోయిన్‌ని అన‌వ‌స‌రంగా క‌లిసా”

Sandeep Reddy Vanga:  సందీప్ రెడ్డి వంగా తీసిన యామిమ‌ల్ (animal) సినిమా ఇంకా ఆడియ‌న్స్ మైండ్‌లో తిరుగుతూనే ఉంది. విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ సినిమా రూ.500 కోట్లు దాటేసింది. యానిమ‌ల్ సినిమాలో ర‌ణ్‌బీర్ క‌పూర్ (ranbir kapoor), ర‌ష్మిక మంద‌న (rashmika mandanna) జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే యానిమ‌ల్ సినిమాను రెండేళ్ల‌ క్రితం అనుకున్న‌ప్పుడు హీరోయిన్‌గా ముందు ప‌రిణీతి చోప్రాను (parineeti chopra) అనుకున్నార‌ట‌. ఈ సినిమా క‌థ‌ను కూడా ఆమెకు వివ‌రించారు.

ఇందుకు ప‌రిణీతి కూడా ఒప్పుకుంది. ఆ త‌ర్వాత లుక్ టెస్ట్ చేసిన‌ప్పుడు గీతాంజ‌లి క్యారెక్ట‌ర్‌కు ప‌రిణీతి అస్స‌లు సూట్ అవ్వ‌లేద‌ట. ఈ విష‌యం ఏడాది త‌ర్వాత తెలిసింది. దాంతో సందీప్ ప‌రిణీతిని రిజెక్ట్ చేసాడు. ఈ విష‌యం తెలిసి ప‌రిణీతి ఎంతో బాధ‌ప‌డింది. హీరోయిన్ క్యారెక్ట‌ర్ కోసం ప‌రిణీతిని అన‌వ‌స‌రంగా క‌లిసాన‌ని.. అస‌లు ఆమె సూట్ అయ్యేవారే కాద‌ని అంతా మంచే జ‌రిగింద‌ని అన్నారు. ఇది తాను కోపంతో చెప్ప‌డంలేద‌ని.. కొన్ని క్యారెక్ట‌ర్లు కొంద‌రు న‌టీన‌టులు సూట్ అవ్వ‌ర‌ని యానిమ‌ల్‌లో గీతాంజ‌లి క్యారెక్ట‌ర్ ప‌రిణీతికి అస్స‌లు సూట్ అవ్వ‌ద‌ని తెలిపారు. ప‌రిణీతితో క‌లిసి ప‌నిచేయాల‌ని త‌న కోరిక అని క‌బీర్ సింగ్ స‌మ‌యంలోనూ ప‌రిణీతిని హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకున్నా కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేద‌ని తెలిపారు సందీప్.