JR NTR: ఒక్క సినిమా ప‌డితేనా..!

sandeep reddy vanga meets jr ntr

JR NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. డైన‌మిక్ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాను క‌లిసారు. దేవ‌ర టీజ‌ర్ ఈ నెల 10న రిలీజ్ కానున్న సంద‌ర్భంగా ప్ర‌స్తుతం తార‌క్ ముంబైలో ఉన్నారు. అక్క‌డే ఉన్న సందీప్ రెడ్డి వంగాను తార‌క్ క‌లిసారు. వీరిద్ద‌రి ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దేవ‌ర సినిమా రాబోతున్న నేప‌థ్యంలో సందీప్ రెడ్డి వంగా తార‌క్‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్నారు. ఈ ఇంట‌ర్వ్యూ కోసం అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ ఒక్క సినిమా ప‌డితే ఇండ‌స్ట్రీ హిట్ ప‌క్కా అంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.