Samuthirakani: ప‌వ‌న్ స్టేట్ లీడ‌ర్ కాదు నేష‌న‌ల్ లీడ‌ర్

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ (pawan kalyan) స్టేట్ లీడ‌ర్ కాద‌ని నేష‌న‌ల్ లీడ‌ర్ అని అన్నారు డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌ని (samuthirakani). ఆయ‌న డైరెక్ట్ చేసిన బ్రో  (bro) సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించారు. 28న సినిమా రిలీజ్ అవుతోంది. ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌న్ గురించి మాట్లాడారు.

నేను 21 రోజులు పవ‌న్ స‌ర్‌తో ప‌నిచేసాను. ఆయ‌న విజ‌న్ వేరు. ఆయ‌న స్టేట్ లీడ‌ర్ కాదు. నేష‌న‌ల్ లీడ‌ర్. స‌ర్‌కి ఉన్న విజ‌న్ రాజ‌కీయాల్లో అప్లై చేస్తే మ‌నం కొత్త లోకంలో ఉంటాం. అది చాలా ఫాస్ట్‌గానే జ‌రుగుతుంది. ఆ ఎన‌ర్జీని దేవుడు స‌ర్‌కి ఇస్తారు అని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.