BRO: ఇంట్రెస్టింగ్ విష‌యం చెప్పిన డైరెక్ట‌ర్..!

Hyderabad: బ్రో (bro) సినిమా రిలీజ్ అవుతున్న స‌మ‌యంలో ఇంట్రెస్టింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెడుతున్నారు డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌ని (samuthirakani). ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan), సాయి ధ‌ర‌మ్ తేజ్ (sai dharam tej) క‌లిసి యాక్ట్ చేసిన బ్రో సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ అవబోతోంది. 15 ఏళ్ల క్రితం చూసిన ప‌వ‌న్‌నే ఈ సినిమాలో మళ్లీ చూడ‌బోతున్నార‌ని స‌ముద్ర‌ఖ‌ని (samuthirakani) హైప్ పెంచేసారు. అయితే ఇప్పుడు ఆయ‌న మ‌రో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు.

బ్రో (bro) స్క్రిప్ట్ చెప్పాల‌ని ప‌వ‌న్ కోసం స‌ముద్ర‌ఖ‌ని ఎంతో వెయిట్ చేసార‌ట‌. కానీ పొలిటిక‌ల్ ప‌రంగా ప‌వ‌న్ బిజీగా ఉండ‌టంతో స‌ముద్ర‌ఖ‌నికి (samuthirakani) ఇంకా అపాయింట్‌మెంట్ దొర‌క‌లేదు. స‌రే అని స‌ముద్ర‌ఖ‌ని హిమాల‌యాల్లో ఉన్న ఓ శివాల‌యానికి వెళ్లార‌ట‌. అక్క‌డ ఆయ‌న ధ్యానంలో ఉండ‌గా ఓ సాధువు వ‌చ్చి నువ్వు నీ స‌క్సెస్‌ఫుల్ జర్నీ స్టార్ట్ చెయ్యాలి. వెంట‌నే వెళ్లు అని చెప్పార‌ట‌. ఆయ‌న ఎందుకు అలా చెప్పారో అని స‌ముద్ర‌ఖ‌ని వెంటనే చెన్నై బ‌య‌లుదేరార‌ట‌. ఆయ‌న ఇంటికి వెళ్లిన మరుస‌టి రోజే క‌థ విన‌డానికి ప‌వ‌న్ నుంచి కాల్ వ‌చ్చింద‌ట‌. ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌ని శివుడు కూడా కోరుకున్న‌ట్లున్నాడేమో అని స‌ముద్ర‌ఖ‌ని అన్నారు. (bro)