Jawan డైలాగ్.. భుజాలు తడుముకున్న సమీర్ వాంఖెడే
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ (shahrukh khan) నటించిన జవాన్ (jawan) ట్రైలర్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. జవాన్ ట్రైలర్ ఒక ఎత్తైతే.. ఇందులో షారుక్ ఖాన్ చెప్పే డైలాగ్ మరో ఎత్తు. నా కొడుకుని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి అని షారుక్ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ఇది మాజీ NCB అధికారి సమీర్ వాంఖడేని (sameer wankhede) ఉద్దేశించే షారుక్ అన్నారని ఈపాటికి చాలా మందికి అర్థమైపోయింది.
ఏడాది క్రితం ఓ క్రూజ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని సమీర్‌కి తెలీడంతో రైడ్ చేసారు. ఆ సమయంలో క్రూజ్‌లో షారుక్ పెద్ద కొడుకు ఆర్యన్ (aryan khan) కూడా ఉన్నాడు. దాంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు నెల రోజుల పాటు ఆర్యన్ జైలులోఉన్నాడు. ఆ తర్వాత ఆర్యన్ డ్రగ్స్ తీసుకోలేదని.. కేవలం పార్టీలో మాత్రమే ఉన్నాడని తెలిసి రిలీజ్ చేసారు. అయితే ఆ తర్వాత సమీర్ వాంఖెడే రూ.25 కోట్లకు షారుక్‌తో డీల్ కుదుర్చుకున్నాడన్న ఆరోపణలపై ఆయన్ను సస్పెండ్ చేసి కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.
ఇప్పుడు షారుక్ తన సినిమాలోని డైలాగ్ ద్వారా సమీర్‌కి పంచ్ వేసారని చాలా హిందీ, ఇంగ్లీష్ వెబ్‌సైట్లు రాసి మరీ రెచ్చగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమీర్ కూడా ఓ ట్వీట్ వేసారు. నేను ఎక్కిన ప్రతి వంతెన కాలిపోతుంటే ఆ మంటలను రుచి చూస్తూ దాని బూడిదెలో డ్యాన్సులు చేసాను. నేను దేనికీ భయపడను. ఇది నికోల్ లియోన్స్ రాసిన కోట్. ఇది ఎప్పుడూ నాకు స్ఫూర్తినిస్తుంటుంది అని ట్వీట్ చేసారు. (jawan)