Samantha: ప్రొడ్యూస‌ర్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్.. ఇచ్చిప‌డేసిందిగా!

Hyderabad: శాకుంత‌లం(shaakuntalam) ఫ్లాప్‌తో కాస్త డ‌ల్ అయింది టాలీవుడ్ క్వీన్ స‌మంత‌(samantha). అయితే ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎవ‌రి చేతిలోనూ ఉండ‌దు. వాటికి కొన్ని కార‌ణాలు ఉంటాయి. అంతేకానీ ఒక హీరోనో హీరోయిన్‌నో టార్గెట్ చేసి మాట్లాడ‌టం స‌బ‌బు కాదు. స‌మంత శాకుంత‌లం సినిమా ప్రమోష‌న్స్ స‌మ‌యంలో చిట్టిబాబు అనే నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేసారు. స‌మంత స్టార్ హీరోయిన్ అనే పేరు, కెరీర్ ముగిసిపోయింద‌ని, సినిమాల కోసం చీప్ పబ్లిసిటీ చేస్తోంద‌ని అన్నారు. దాంతో స‌మంత‌కు ఒళ్లు మండిన‌ట్లుంది. త‌న గురించి త‌ప్పుగా మాట్లాడినా, అస‌భ్య‌క‌రంగా మాట్లాడినా స‌మంత అస్స‌లు ఊరుకోదు. ఇప్పుడు చిట్టిబాబుకు కూడా దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది.

అయితే నేరుగా ఆయ‌న్ని ఏమీ అన‌లేదు కానీ ఇన్‌డైరెక్ట్‌గా నోరుమూయించింది. అదెలా అంటే.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టింది. చెవుల్లో నుంచి జుట్టు ఎందుకు వ‌స్తుంది? అనే ప్ర‌శ్న‌ను గూగుల్‌లో టైప్ చేసి ఆ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది. అందులో టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండ‌టం వ‌ల్ల అన్న ప‌దాలు హైలైట్ చేసి ఉన్నాయి. ఈ పోస్ట్‌కి స‌మంత #IYKYK అని కామెంట్ చేసింది. దీనికి అర్థం మీకు తెలిస్తే మీకు తెలుసు అని. దాంతో అది చిట్టిబాబుకి గ‌ట్టి కౌంట‌రే అంటూ నెటిజ‌న్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే.. చిట్టిబాబుకి చెవుల్లో ఎక్కువ జుట్టు ఉంటుంది. బాగా బుద్ధిచెప్పావ్ సామ్ అంటూ ఫ్యాన్స్ కూడా ప్ర‌శంసిస్తున్నారు.

ఇక‌పోతే శాకుంత‌లం స‌మంత కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. గుణ‌శేఖ‌ర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆడియ‌న్స్ ప‌ల్స్‌ను ప‌ట్ట‌లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ సామ్ కుంగిపోలేదు. హిట్స్‌, ఫ్లాప్స్ యాక్ట‌ర్స్ జీవితాల్లో కామ‌నే అనుకుంటూ త‌న త‌దుప‌రి సినిమాపై దృష్టిపెట్టింది. సామ్ ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉంది. బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్‌తో క‌లిసి సిటాడెల్ మూవీలో న‌టించ‌బోతోంది.