Samantha: మ‌న‌సుకి త‌గిలిన గాయం మాన‌డం క‌ష్టం

Samantha: మ‌న‌సుకి త‌గిలిన గాయం మాన‌డం చాలా క‌ష్ట‌మ‌ని అందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు స‌మంత‌. ఫెమీనా మ్యాగ‌జైన్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన స‌మంత తాను జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి స్పందించారు. త‌న‌కు త‌న‌పై కాన్ఫిడెన్స్ చాలా త‌క్కువ‌గా ఉండేద‌ని అయినా ఎలాగో అలా జీవితం అనే ఈ స‌ముద్రంలో ఈదుతున్నాన‌ని తెలిపారు. త‌న‌కు బాధ క‌లిగించే అంశాల గురించి ప‌ట్టించుకుంటూనే వాటి నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నాన‌ని అన్నారు. శ‌రీరానికి త‌గిలిన గాయాల కంటే మ‌న‌సుకి త‌గిలిన గాయాలు మాన‌డానికి చాల స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. మ‌యోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న సామ్ ప్ర‌స్తుతానికి ఫోటోషూట్స్‌లో మాత్ర‌మే పాల్గొంటున్నారు. ఖుషి (Kushi) సినిమా త‌ర్వాత ఏడాది పాటు సామ్ బ్రేక్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సామ్ నుంచి కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు.