Samantha: కాపురం చేసుకోవడం తెలీదు కానీ అని వాగిన వ్యక్తి.. సమంత ఏమంది?
Samantha: సమంత, నాగ చైతన్య (naga chaitanya) విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు చూసుకుంటున్నారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం వారి విడాకులను అంగీకరించలేకపోతున్నారు. కొందరేమో నాగ చైతన్యదే తప్పు అంటుంటే మరికొందరు సమంత వల్లే కాపురంలో సమస్యలు వచ్చినట్లున్నాయి అని దగ్గరుండి చూసినట్లు ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. సమంత తన వృత్తికి సంబంధించిన అంశాలు కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కానీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే ఓ పనికిమాలిన బ్యాచ్ ఏదో ఒకటి కామెంట్ చేసేందుకు రెడీగా ఉంటుంది.
ఇటీవల సమంత ర్యాపర్ బాద్‌షాతో పాటు ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలువల గురించి మాట్లాడారు. ఆ వీడియో చూసిన ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. నిజ జీవితంలో కాపురం ఎలా చేయాలో.. ఫ్యామిలీని ఎలా నడపాలో తెలీదు కానీ ఇలా షోలకు వచ్చి విలువల గురించి మాట్లాడుతోంది. అసలు ఆమెను ఎవరు ఇన్‌వైట్ చేస్తున్నారు అని కామెంట్ చేసారు. ఈ కామెంట్ సమంత చూసి వెంటనే స్పందించారు. ష్…… కూర్చో అని చిన్న మాటతో ఆ ట్రోలర్ నోరుమూయించారు.