Cannes Film Festival: 4 అవార్డులు సొంతం చేసుకున్న ‘శాకుంతలం’!

 France: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన మైథ‌లాజిక‌ల్ మూవీ ‘శాకుంతలం’ (Shaakuntalam). కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా గుణశేఖర్‌ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక భారీ పరాజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టలేకపోయినా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అవార్డులు మాత్రం అందుకుంటోంది.

తాజాగా ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) లో శాకుంతలం సినిమా ఏకంగా 4 అవార్డులను సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫారెన్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫాంటసీ ఫిల్మ్‌, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ కేటగిరీలో ఈ సినిమా అవార్డ్స్ ని అందుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

కాగా ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో కనిపించారు. అల్లు అర్జున్ (Allu Arjun) కూతురు అల్లు అర్హ(Allu Arha) ప్రిన్స్ భరత పాత్రలో నటించి ఆకట్టుకుంది. మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.