Samantha: నా పర్సనల్ అంశాలు బయటికొచ్చాయన్న బాధలేదు
Samantha: ఏ మాయ చేసావె (yemaya chesave) సినిమాతో సినిమాల్లో అడుగుపెట్టింది సమంత. తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇక సామ్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు తన సౌతిండియాలోనే టాప్ స్టార్. సినిమాల్లోకి రాకముందు సామ్ మోడలింగ్ రంగంలోకి వచ్చారు.
అయితే అసలు తనకు సినిమాలు, మోడలింగ్ అనే అంశాల గురించి కూడా పెద్దగా తెలీవని గతిలేక ఇటు వైపు వచ్చానని అన్నారు సామ్. ప్రముఖ మ్యాగజైన్ హార్పర్స్ బజార్‌కు (harpers bazaar) ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను ఎప్పుడూ చదువుపైనే దృష్టి పెట్టేదాన్నని.. చదువు తప్ప తనకు ఏమీ తెలీదని అన్నారు. కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో గతి లేక మోడలింగ్ ట్రై చేయాలనుకున్నానని వెల్లడించారు. జీవితం అంధకారంలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలీనప్పుడు మోడలింగ్‌లోకి వచ్చాకే తన జీవితంలో ఒక ఆశయం ఏర్పడిందని అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు సామ్. (samantha)
నా పర్సనల్ అంశాలు బయటికొచ్చాయన్న బాధలేదు
ఇక నాగ చైతన్యతో తన పెళ్లి బ్రేక్ అవ్వడం గురించి మాట్లాడుతూ.. చాలా మంది చిన్న విషయాలకు కూడా ఎంతో కుంగిపోతుంటారని అలాంటివారి జీవితాల గురించి తెలుసుకోవడం వల్ల తనకు కాస్త సాంత్వన కలిగిందని తెలిపారు. వారు అలాంటి బాధల నుంచి బయటపడినప్పుడు తాను కూడా బయటపడగలను అన్న ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు.
ఇండియాలో ఒక స్టార్‌గా ఎదిగి అభిమానుల ప్రేమను సొంతం చేసుకోవడం అనేది చిన్న విషయం కాదని.. ఎంతో అదృష్టం ఉండాలని అన్నారు. తన పర్సనల్ అంశాలు పబ్లిక్‌కి తెలిసినప్పుడు బాధ అనిపించలేదని.. నిజానికి తనను దృఢంగా మార్చాయని అన్నారు. తనలాగా జీవితంలో ఇలాంటి బాధలు పడుతున్నవారు కూడా తనలాగే దృఢంగా మారతారని భావిస్తున్నానని పేర్కొన్నారు.