Samantha: ధోనీ ఇష్టం.. కానీ కోహ్లీ కోసం ఏడ్చేశా!

Hyderabad: టాలీవుడ్​ హీరోయిన్​ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) జంటగా నటిస్తున్న సినిమా ఖుషి(Kushi).  శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్నఈ సినిమాను సెప్టెంబర్​ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇటీవల విజయ్​ బర్త్​డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా సమంత, విజయ్ దేవరకొండ ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. IPL నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో సమంత, విజయ్ దేవరకొండ సినిమాతో పాటు, క్రికెట్ గురించి పలు ఆసక్తికర అంశాలు మాట్లాడారు. వాళ్ళ లైఫ్ లో క్రికెట్ ఎలా భాగమైందో తెలిపారు. ఈ నేపథ్యంలో సమంత తన ఫేవరేట్ క్రికెటర్స్ గురించి చెప్పుకొచ్చింది. ‘MS ధోని నా ఫేవరేట్ క్రికెటర్. అసలు ధోని అంత కూల్ గా ఎలా ఉంటాడో అర్థంకాదు. ఆ విషయంలో చాలా ఇష్టం. IPL లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే నాకు ఇష్టం. ఆ టీంకు సపోర్ట్ చేస్తాను. ఇక విరాట్ కోహ్లీ అంటే కూడా ఇష్టం. గతేడాది విరాట్ కోహ్లీ ఆసియాకప్ లో కంబ్యాక్ సెంచరీ చేసినప్పుడు నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. అప్పుడు ఏడ్చేశాను కూడా’ అని తెలిపింది సామ్​. ధోని(MS Dhoni), కోహ్లీ(Virat Kohli) గురించి సమంత తన ఫేవరెట్​ అని చెప్పడంతో క్రికెట్(Cricket)​ అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.