Urfi Javed: స‌మంత‌.. నీలాంటి అమ్మాయిని నా జీవితంలో చూడ‌లేదు

samantha ruth prabhu praises urfi javed

Urfi Javed:  విచిత్ర‌మైన దుస్తులు వేసుకుంటూ బాలీవుడ్‌లో పాపుల‌ర్ అయిన ఉర్ఫీ జావేద్‌కు స‌మంత మ‌ద్ద‌తుగా నిలిచారు. ఉర్ఫీ ఫాలో క‌ర్లో యార్ అనే పాడ్‌కాస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇది అమెజాన్ ప్రైంలో అందుబాటులో ఉంది. ఈ పాడ్‌కాస్ట్‌లో ఉర్ఫీ త‌న జీవితానికి సంబంధించిన విష‌యాల‌న్నీ షేర్ చేసుకున్నారు. అయితే నిన్న రాత్రి స‌మంత ఒక ఎపిసోడ్ చూసార‌ట‌. ఓ ఆడ‌పిల్ల ధైర్యంగా త‌న జీవితంలోని అంశాల‌ను బ‌య‌ట‌పెడితే ట్రోల్ చేస్తార‌ని.. అదృష్టం బాగుంటే ఆద‌రిస్తార‌ని అన్నారు. ఉర్ఫీ ఎంతో ధైర్య‌వంతురాల‌ని ఆమె మరింత ఎత్తుకు ఎద‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. దీనికి ఉర్ఫీ బ‌దులుగా.. స‌మంత‌.. ఇక రాత్రంతా నేను ఏడుస్తూనే ఉంటా. నీ లాంటి అమ్మాయిని నా జీవితంలో చూడ‌లేదు అని రిప్లై ఇచ్చారు.