Samantha: వాడిలాంటోళ్లు చాలా మందే ఉంటారు.. డేటింగ్ రూమర్స్‌పై సమంత స్పందన
Samantha: కొద్ది రోజులుగా తనపై వస్తున్న రూమర్స్‌పై ఎట్టకేలకు స్పందించారు నటి సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. నాగచైతన్యతో వివాహమైనప్పుడే సమంత రాజ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అందుకే వారికి విడాకులు అయ్యాయంటూ ఎవరికి తోచిన స్క్రిప్ట్ వారు రాసేసుకున్నారు. దీనిపై సమంత ముఖం పగిలేలా సమాధానం ఇచ్చారు. మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్ట్ చేసిన ఒక్క ఫోటోతో ఈ రూమర్స్ రాయుళ్లకు చెక్ పెట్టారు.
వాడిలాంటోళ్లు చాలా మందే ఉంటారు
మరోపక్క సమంత కలకత్తాలో ఓ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన గురించి కూడా స్పందించారు. “” నేను మరోసారి ఈ మాట చెప్తున్నా. ఒక అమ్మాయిని ఎలాగైనా కిందికి లాగాలని మీడియా, పాలిటిక్స్ ప్రయత్నిస్తుంటాయి. నిందితుడికి మతి భ్రమించిందని చెప్తుంటారు. ఆల్రెడీ రిపోర్టుల్లో వాడు చేసిన పనికి కొంచెం కూడా పశ్చాత్తాపం లేదని తెలుస్తోంది. పైగా వాడి ఫోన్‌లో పోర్న్ కంటెంట్ లభించింది. నిందితుడికి ఎలాంటి మతి భ్రమించలేదు. వాడు కచ్చితంగా మన లాంటి సాధారణ మనిషే. వాడిలాంటోళ్లు మనలో చాలా మంది ఉన్నారు.
ఈ అంశాన్ని ఒక బహిరంగ సమస్యగా పరిగణించినంత వరకు అలాంటివాళ్లు మన మధ్యే ఉంటుంటారు.. చేతిలో ఉన్న అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇది కేవలం వైద్యుల సంరక్షణకు సంబంధించిన అంశం కాదు. ఎవరైతే ఆడవాళ్లు రాత్రిళ్లు బయట తిరగకూడదు.. కొన్ని రకాల దుస్తులు వేసుకుంటే అత్యాచారానికి గురవుతారు.. వాళ్లు ఎదిరిస్తే నోటికొచ్చినట్లు అవమానించాలి అని ఆలోచిస్తారో వారందరిదీ. ఇలాంటి దిక్కుమాలిన పితృస్వామ్య పరిపాలన ఏమైనా అయిపోనివ్వండి. కానీ ఆ అమ్మాయికి గౌరవంగా జీవించే హక్కు మాత్రం ఉంది “” అంటూ మండిపడ్డారు.