Samantha: మళ్లీ పెళ్లిపై సామ్ రియాక్షన్
Samantha: సమంత నాగచైతన్యల (naga chaitanya) విడాకుల తర్వాత వీరిద్దరూ మళ్లీ ఎప్పుడో ఒకప్పుడు కలిసిపోరా అని ఎదురుచూడని ఫ్యాన్స్ లేరు. పోనీ మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం అయినా లేకపోదా అనుకుంటున్నవారూ ఉంటారు. ఇప్పటికీ సమంత ఏదన్నా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేయాలనుకున్నా లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ చేయాలనుకున్నా కూడా ఈ పెళ్లి ప్రశ్న తప్పకుండా ఉంటుంది. నిన్నే సమంత ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ చేసారు. ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని లేదా? అని అడగ్గా.. సమంత ఓ రిపోర్ట్‌ను షేర్ చేస్తూ.. మొదటిసారి పెళ్లి చేసుకున్నవారి కంటే రెండోసారి పెళ్లి చేసుకున్నవారే ఎక్కువగా విడిపోతున్నారని పేర్కొన్నారు. ఈ రెండో పెళ్లి అనేది వేస్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్ అని అభిప్రాయపడ్డారు.