Samantha: సౌత్ ఇండస్ట్రీ నాకోసం నిలబడింది
Samantha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన వ్యక్తిగత విషయాల గురించి అసహ్యంగా మాట్లాడిన సమయంలో సౌత్ ఇండస్ట్రీ తనకోసం నిలబడింది అని అన్నారు సమంత. ఆమె నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసారు. “” సౌత్ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ, ప్రజలు చూపించిన ప్రేమే ఈ వివాదం నుంచి బయటకు వచ్చేలా చేసింది. వారే మరింతగా కుంగిపోయేదానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నా “” అని తెలిపారు.