Samantha: సామ్ మేనేజర్ మోసాలు..!
సమంత (samantha) ప్రస్తుతం మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె న్యూయార్క్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. అయితే ఎప్పుడైతే సమంతకు మయోసిటిస్ రావడం వల్ల తన వర్క్‌పై ఫోకస్ చేయలేకపోతోందో.. వెన్నంటే ఉంటూ హెల్ప్ చేయాల్సిన మేనేజర్ సామ్‌ని మోసం చేసాడట. గత కొన్ని రోజులుగా సమంత తన మేనేజర్‌తో గొడవపడుతోందట. ఇందుకు కారణం.. సమంతకు తెలీకుండా ప్రొడ్యూసర్లతో సీక్రెట్ డీలింగ్స్ చేయడమే. ఈ విషయం గురించి ఇండస్ట్రీలోకి చెందిన కొందరు వెంటనే ఇప్పుడున్న మేనేజర్‌కి మార్చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారట. అతను ఒకప్పుడులా లేడని.. ఇప్పుడు పూర్తిగా మారిపోయి డబ్బు కోసం మోసాలకు పాల్పడుతున్నాడని చెప్పారట. ఇదే విషయం గురించి సామ్ తన మేనేజర్‌తో చర్చిస్తోంది. న్యూయార్క్ నుంచి వచ్చాక అతన్ని టెర్మినేట్ చేసేయాలని అనుకుంటోందట. (samantha)
కోటి నొక్కేయాలనుకున్నాడు..!
అయితే.. ఖుషి సినిమాకు గానూ సామ్ రూ.3 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. అయితే సామ్ మయోసైటిస్‌తో బాధపడుతుండడం వల్ల మధ్యలో చాలా సార్లు షూటింగ్ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. దాంతో సామ్ రూ.3 కోట్లు తీసుకోవడం సబబు కాదని భావించి.. కోటి మాత్రమే ఇవ్వమని తన మేనేజర్‌కు చెప్పింది. అయితే అప్పటికే ఆ మేనేజర్.. సమంత 2 కోట్లు అడుగుతున్నారు.. అందులో ఒక కోటి తనకే ఇవ్వాలని మాట్లాడుకున్నాడట. ఈ విషయం సామ్‌కి తెలీదు. అయితే ఆ నిర్మాతలు సామ్‌కి ఫోన్ చేసి ఇంకో కోటి ఎప్పుడు ఇవ్వాలి? అని అడిగారట. సామ్‌కి అర్థంకాలేదు. అదేంటి సర్.. నేను కోటి రూపాయలే కదా అడిగింది.. ఇంకో కోటి ఎందుకు అని అడిగింది. అప్పుడు మేనేజర్ నిర్వాకం బయటపడింది. దాంతో సామ్ అతన్ని టెర్మినేట్ చేయాలని అనుకుంటోంది. (samantha)