Samantha కీలక నిర్ణయం
Hyderabad: టాలీవుడ్ క్వీన్ సమంత (samantha) కీలక నిర్ణయం తీసుకుంది. సంవత్సరం పాటు యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ పేమెంట్స్‌ని ప్రొడ్యూసర్స్‌కు రిటర్న్ చేసేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఏడాదిగా మయోసిటిస్‌తో బాధపడుతున్న సమంత (samantha) కొన్ని సినిమాలను కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు తను సిటాడెల్ (citadel) అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్ షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇక యాక్టింగ్ నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటోంది. ప్రస్తుతం సమంత (samantha) ద్రాక్షారామంలో ఉన్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చెప్తోంది. ప్రొఫెషనల్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుని మళ్లీ ఫ్రెష్‌గా మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించాలని అనుకుంటోంది సామ్.