Samantha: అత‌నికి పెళ్లి సంబంధాలు చూస్తున్న సామ్!

Hyderabad: స‌మంత(samantha) ఓ వ్య‌క్తి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ వ్య‌క్తి ఎవ‌రా అనుకుంటున్నారా? అత‌నే జివెల్ గ‌మాడియా(jewel gamadia). ఇత‌ను ఫేమ‌స్ సెలబ్రిటీ డాక్ట‌ర్. అనుష్క శ‌ర్మ‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ లాంటి స్టార సెల‌బ్రిటీలు ఇత‌ని వ‌ద్ద వెస్ట్ర‌న్ యాక్యుపంక్చ‌ర్ చేయించుకుంటూ ఉంటార‌ట‌. స‌మంత(samantha) కూడా త‌న మ‌యోసిటిస్ ట్రీట్మెంట్‌లో భాగంగా జివెల్ వ‌ద్ద‌కు వెళ్తున్నారు. అయితే.. నిన్న సామ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టారు. ఇత‌ని కోసం స‌రైన సంబంధం వెతుకుతున్నాను. అత‌ను క‌నిపించేదాని క‌న్నా ఇంకా స్మార్ట్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక సామ్ సినిమాల విష‌యానికొస్తే.. ఆమె న‌టించిన శాకుంత‌లం(shaakuntalam) డిజాస్ట‌ర్ అయిపోయింది. ఓటీటీలో కూడా పెద్ద‌గా వ్యూస్ రాలేదు. ఇప్పుడు సామ్ హోప్స్ అన్నీ ఖుషి(kushi) సినిమాపైనే ఉన్నాయి. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌(vijay devarakonda), సామ్ జంట‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన నా రోజా నువ్వే సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో పాటు అటు బాలీవుడ్‌లో వ‌రుణ్ ధావ‌న్‌తో క‌లిసి సిటాడెల్‌లో(citadel) యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా మ‌రో సినిమాకు కూడా సైన్ చేసారు. యంగ్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డతో(siddu jonnalagadda) క‌లిసి సామ్ యాక్ట్ చేయ‌బోతున్నారు.