Samantha: ట్రెండీ లుక్స్​లో సామ్​!

London: టాలీవుడ్​ హీరోయిన్​ సమంత(Samantha) హాలీవుడ్​ వెబ్​సిరీస్​ సిటాడెల్​(Citadel) ఇండియన్​ వర్షన్​లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శాకుంతలం(Shaakunthalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్​ ఆశించినంతగా మెప్పించలేకపోయారు. ఇక, ప్రస్తుతం సమంత లండన్‌(London)లో ఉన్నారు. హాలీవుడ్‌లో తెరకెక్కిన సిటాడెల్‌ ప్రీమియర్స్‌ కు హాజరుకావడానికి అక్కడికి వెళ్లారు. కాగా, ప్రస్తుతం లండన్‌లో సమంత ట్రెండీ లుక్స్ వైరల్ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు శాకుంతలం ప్రమోషన్స్‌ లో హోమ్లీ లుక్​లో మెరిసిన సామ్​.. ఇప్పుడు ట్రెండీ లుక్‌లోకి మారిపోయారు. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న సమంత ఫొటో చూసిన అభిమానులు హాలీవుడ్‌ హీరోయిన్‌లా ఉన్నారంటూ కామెంట్​ చేస్తున్నారు.

ఇక, సిటాడెల్‌ వరల్డ్ ప్రీమియర్‌‌ కోసం లండన్‌ వెళ్లిన సమంత.. ధరించిన నగలు కూడా ట్రెండీగానే ఉన్నాయి. ఈ ఈవెంట్​లో రెడ్‌ కార్పెట్‌పై నడిచారు సామ్. ఆమెతోపాటు సహనటుడు వరుణ్ ధావన్‌(Varun Dhawan), ఇండియన్‌ సిటాడెల్‌ టీమ్, చిత్ర నిర్మాతలు రాజ్‌ అండ్ డీకే కూడా ప్రీమియర్స్‌ కు హాజరయ్యారు. సిటాడెల్ ఇంటర్నేషనల్ వెర్షన్‌లో రిచర్డ్‌ మాడెన్, ప్రియాంక చోప్రా(Priyanka chopra) కలిసి నటించారు.

కాగా, ఈ ప్రీమియర్స్‌ కు సమంత బ్లాక్ డ్రెస్, బల్గారీ డైమండ్ జ్యువెలరీ ధరించారు. ఆమె మెడలో పాము ఆకారంలో ఉన్న నెక్లెస్ పెట్టుకున్నారు. అంతేకాదు, బెవెల్‌గారి డైమండ్ బ్రేస్‌లెట్‌ కూడా అద్భుతంగా ఉంది. దానిని సెర్పెంట్ బ్రేస్‌లెట్‌ అంటారు. సిటాడెల్‌ ఇండియా టీమ్‌తో చేరే ముందు సమంత క్యూట్ స్మైల్ తో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.