Samantha: కోహ్లీని ఇమిటేట్ చేసిన సామ్‌..!

Hyderabad: టాలీవుడ్ క్వీన్ స‌మంత‌(samantha).. క్రికెట‌ర్ విరాట్ కోహ్లీని(virat kohli) ఇమిటేట్ చేసారు. సామ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఖుషి(kushi) సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సింపుల్‌గా ఎప్పుడూ ఉండేలా ప్ర‌మోష‌న్స్ చేయ‌కుండా వీళ్లు ఐపీఎల్ ద్వారా సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. నిన్న జ‌రిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్, దిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్ సంద‌ర్భంగా సామ్‌, విజ‌య్ స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో ప్ర‌మోషన్స్ చేసారు. ఈ సంద‌ర్భంగా యాంక‌ర్ వీరిద్ద‌రి చేత క్రికెట్ చ‌రాడ్స్ ఆడించారు. అలా విజ‌య్ క్రికెట‌ర్ల పేర్లు చెబుతుంటే.. సామ్ వారిని ఇమిటేట్ చేయాల‌న్న మాట‌. విజ‌య్‌.. కోహ్లీ పేరు తీసిన‌ప్పుడు.. మొన్న వివాదాస్ప‌దంగా మారిన గంభీర్-కోహ్లీ ఫైట్‌లో కోహ్లీ చేసిన సైగ‌ల‌ను సామ్ ఇమిటేట్ చేసారు. అలా సామ్ వీడియో కాస్తా వైర‌ల్‌గా మారింది.