మృణాల్.. కలిసి సినిమా చేద్దాం..!
Hyderabad: టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నటించిన తాజా చిత్రం శాకుంతలం(Shaakunthalam). డైరెక్టర్ గుణశేఖర్(Guna Shekar) రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటరల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమా ప్రమోషన్లతో చాలా బిజీగా గడిపిన సామ్(Samantha) కాస్త అస్వస్థతకు గురవడంతో విశ్రాంతి తీసుకుంటోంది. సినిమాలతోపాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ ఉంటుంది సమంత. తాజాగా సమంతతో కలిసి పనిచేయాలని ఉందంటూ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) సోషల్ మీడియా ద్వారా తన కోరికను పంచుకుంది. దీనికి సామ్ కూడా వెంటనే సమాధానం ఇస్తూ ఈ ఐడియా తనకు కూడా నచ్చిందంటూ చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారా అనే టాక్ నడుస్తోంది.
సీతారామం(sita ramam)తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). బాలీవుడ్(Bollywood)లోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సమంతతో కలిసి నటించాలని ఉందంటూ లేటెస్ట్ గా ట్విట్టర్ లో ఆస్క్ సామ్ అనే హ్యాష్ ట్యాగ్ లో తన అభిప్రాయం తెలిపింది. సమంతను ఉద్దేశిస్తూ‘శాకుంతలం సినిమాను ఎప్పుడెప్పుడు అని ఆతృతగా ఉంది. సామ్.. మీరు చాలామందిని ఇన్స్ స్పైర్ చేస్తున్నారు’ అంటూ ఎంతో ఎగ్జైటింగ్‌గా చెప్పుకొచ్చింది మృణాల్. ‘మనిద్దరం కలిసి సినిమా ఎప్పుడు చేద్దాం.. ’అంటూ ప్రశ్నించింది. దీనికి సమంత కూడా వెంటనే రియాక్ట్ కావడం విశేషం. ‘ఈ ఐడియా నాకు నచ్చింది. “#Gumraah beautiful @mrunal0801కి అభినందనలు చెబుదాం. మీరూ ఈ ఐడియాని ప్రేమించండి!!’ అంటూ రిప్లై ఇచ్చింది సమంత(Samantha). వీరిద్దరూ కలిసి ఏదో సినిమాలో భాగమయ్యారనీ, ఇది దానికే సంకేతం.. అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి అసలు విషయం తెలియాలంటే అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.