Samantha: నువ్వే నా ఫేవరెట్​ విజయ్​!

Hyderabad: నువ్విలా(Nuvvilaa) సినిమా​తో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన విజయ్​ దేవరకొండ(Vijay Deverakonda) పెళ్లి చూపులు(Pelli Choopulu) సినిమాతో హీరోగా అదిరిపోయే హిట్​ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత జయాపజయాలు లెక్క చేయకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు విజయ్​. గీత గోవిందం, అర్జున్​ రెడ్డి, టాక్సీవాలా సినిమాలతో యూత్​కి ఫెవరెట్​ స్టార్​గా ఎదిగారు. హీరోగా అలరిస్తూనే పలు సినిమాల్లో అతిథి పాత్రలతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో వచ్చిన లైగర్(Liger)​తో కాస్త ఢీలా పడిన విజయ్​ ‘ఖుషి’(Kushi)తో మళ్లీ అభిమానులను ఖుషీ చేసేందుకు రాబోతున్నారు. శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ సినిమాలో విజయ్​కి జోడీగా సమంత(Samantha) నటిస్తోంది. ఇక వీళ్లిద్దరూ ముందు నుంచే మంచి ఫ్రెండ్స్​ అని తెలిసిందే. మహానటిలోనూ ఇద్దరూ జంటగా నటించారు.

ఈరోజు రౌడీ హీరో విజయ్​ పుట్టిన రోజు సందర్భంగా సోషల్​ మీడియా వేదికగా సామ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ​తాజాగా సమంత విజయ్ దేవరకొండ బర్త్‌డే CDPని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘నా గుడ్ ఫ్రెండ్, నాకు చాలా ఇష్టమైన నా ఫేవరేట్ యాక్టర్ విజయ్ దేవరకొండ బర్త్‌డే CDPని లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ సక్సెస్ కోసం నేను ప్రే చేస్తాను. నీకు లైఫ్ లో ప్రతి దాంట్లోను బెస్ట్ దొరకాలి. నువ్వు దానికి అర్హుడవు’ అంటూ రాసుకొచ్చింది. దీంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది.

శాకుంతలం(Shaakunthalam) సినిమాతో కాస్త డల్​ అయిన సమంత ప్రస్తుతం ఖుషి షూటింగ్​తో బిజీగా ఉంది. త్వరలోనే సిటాడెల్(Citadel)​ ఇండియన్​ వెర్షన్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.