Samantha: హీరో పోస్ట్‌పై సామ్, శోభిత కామెంట్స్..!

Samantha: స‌మంత రుత్ ప్ర‌భు, శోభిత ధూళిపాల (Sobhita Dhulipala) గురించి చ‌ర్చ వ‌స్తే కచ్చితంగా అది వివాదాస్ప‌దంగానే ఉంటుంది. ఎందుకంటే వీరిద్ద‌రూ నాగ చైత‌న్య‌కు లైఫ్‌కు లింక్ అయ్యి ఉన్నారు. స‌మంత అయితే నాగ చైతన్య‌కు (Naga Chaitanya) మాజీ భార్య. కానీ శోభిత కాబోయే భార్య అన్న టాక్ ఎప్ప‌టినుంచో ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. ఇప్పుడు స‌మంత‌, శోభిత విష‌యం ఎందుకు వైర‌ల్ అవుతోందంటే.. వీరిద్ద‌రూ ఓ హీరో పెట్టిన పోస్ట్‌పై కామెంట్స్ చేసారు.

ఆ హీరో ఎవ‌రో కాదు… బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావన్ (Varun Dhawan). వ‌రుణ్ భార్య న‌టాషా ద‌లాల్ (Natasha Dalal) గ‌ర్భం దాల్చిన నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని వ‌రుణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించాడు. ఈ పోస్ట్‌పై స‌మంత, శోభిత కామెంట్స్ చేసారు. బెస్ట్ న్యూస్ అని స‌మంత కామెంట్ చేయ‌గా.. సో స్వీట్ అని శోభిత కామెంట్ పెట్టారు. వీరితో పాటు ఇంకా ఎంద‌రో సెల‌బ్రిటీలు వ‌రుణ్‌కు శుభాకాంక్ష‌లు చెప్తూ కామెంట్స్ చేసారు. కానీ స‌మంత ఫ్యాన్స్ మాత్రం శోభిత‌, సామ్ కామెంట్స్‌పైనే ఫోక‌స్ పెట్టారు. మాజీ భార్య‌, కాబోయే భార్య ఒకే కామెంట్ సెక్ష‌న్‌లో అంటూ అస‌భ్య‌క‌రంగా ట్రోల్ చేస్తున్నారు.

ఏమాయ‌చేసావె సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మాయ‌లో పడేసారు నాగ చైత‌న్య, స‌మంత‌. ఆ త‌ర్వాత ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. మధ్య‌లో ఒక‌టి రెండు సార్లు మీడియా కంట ప‌డ‌టంతో రూమ‌ర్స్ నిజ‌మే అనుకున్నారు. ఆ త‌ర్వాత ఏకంగా నాగార్జున‌తో క‌లిసి స‌మంత, నాగ‌చైత‌న్య ఓ పెళ్లి వేడుక‌కు హాజ‌రుకావ‌డంతో క‌న్ఫామ్ అయిపోయింది. అలా నాగ‌చైత‌న్య‌, స‌మంతల వివాహం 2017 అక్టోబ‌ర్ 6న గోవాలో హిందూ, క్రైస్త‌వ సంప్ర‌దాయంలో జ‌రిగింది. నాలుగేళ్లు బాగానే ఉన్నారు. ఇంత‌లో ఓ జ‌ర్న‌లిస్ట్ త్వ‌ర‌లో టాలీవుడ్ టాప్ క‌పుల్ విడాకులు తీసుకోబోతున్నారు అని ట్వీట్ చేసారు. ఎవ‌రై ఉంటారా అని అనుకున్నారు కానీ అది స‌మంత‌, నాగ చైతన్య అవుతార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఆ త‌ర్వాత 2021లో స‌మంత‌, నాగ‌చైత‌న్య తాము విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందుకు కార‌ణం ఏంటో ఎవ్వ‌రికీ తెలీదు. (Samantha)

సెల‌బ్రిటీల ప‌ర్స‌న‌ల్ విష‌యాలు బ‌య‌టికి వ‌స్తే చాలా ద‌రిద్రంగా ఉంటాయి. అందుకే ఎన్నో ఇంట‌ర్వ్యూలో మీడియా వ‌ర్గాలు ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చింది అని అడిగినా కూడా సామ్, చైత‌న్య ఎలాంటి కార‌ణాలు వెల్లడించ‌లేదు. వ‌ర్క‌వుట్ అవుతుంది అనుకున్నాం కానీ కాలేదు అని మాట దాటేసారు. అయితే స‌మంతకి స్టైలిస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న జుకల్క‌ర్ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ మాత్రం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. స‌మంత, నాగ‌చైత‌న్య విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత ఇప్పుడు నీకు సంతోష‌మేనా? నువ్వు అనుకున్న‌ది సాధించావు క‌దా బిచ్ అని స్టోరీ పెట్టాడు. కొన్ని నిమిషాల‌కే ఆ స్టోరీని డిలీట్ చేసేసాడు.

ఈ మ‌ధ్య‌కాలంలో నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాల డేటింగ్‌లో ఉన్నార‌ని వార్తలు రావ‌డంతో ముందు ఎవ్వ‌రూ న‌మ్మ‌లేదు. కానీ లండ‌న్‌లోని ఓ రెస్టారెంట్‌కు నాగ చైత‌న్య‌, శోభిత క‌లిసి వెళ్లిన ఫోటో బ‌య‌టికి రావ‌డంతో శోభిత కార‌ణంగానే నాగ‌చైతన్య‌, స‌మంత విడిపోయార‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

నాగ‌చైత‌న్య రెండో పెళ్లి గురించి రూమ‌ర్స్ వస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న గురించి షాకింగ్ విష‌యం ఒక‌టి వైర‌ల్ అవుతోంది. న‌టి శోభిత ధూలిపాల‌తో ఇప్ప‌టికీ డేటింగ్‌లోనే ఉన్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెప్తున్నాయి. వారు ఇప్ప‌టికీ క‌లిసే ఉన్నార‌ని అంటున్నారు. త్వ‌ర‌లో త‌మ రిలేషన్‌షిప్ గురించి ప‌బ్లిక్‌గా అనౌన్స్ కూడా చేసేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు టాక్. మ‌రోప‌క్క నాగ‌చైత‌న్య‌కు రెండో పెళ్లి చేయాల‌ని ఆయ‌న అమ్మ ల‌క్ష్మి అనుకుంటున్నారు. స‌మంత‌తో విడాకులు అయ్యాక మ‌ళ్లీ సినిమా రంగానికి చెందిన అమ్మాయితో కాకుండా బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో చై పెళ్లి చేయాల‌ని ప్లాన్ వేస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

ఇదే విష‌యం గురించి నాగ చైత‌న్య‌ను అడిగితే.. న‌వ్వి ఊరుకుంటాను అన్నాడు. శోభిత‌ను అడిగితే.. నా ప‌ర్స‌నల్ విష‌యాలు నేనెందుకు బ‌య‌ట‌పెట్టాలి అన్నారు. సో త్వ‌రలో వీరిద్ద‌రూ త‌మ రిలేష‌న్‌షిప్‌ని అఫీషియ‌ల్ చేయాల‌ని అనుకుంటున్నార‌ని శోభిత‌, చై స‌న్నిహిత వ‌ర్గాలు మీడియా ద్వారా వెల్ల‌డించాయి.