Salaar తాత చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ..!
రెబెల్ స్టార్ ప్రభాస్ (prabhas) నటిస్తున్న సలార్ (salaar) సినిమా టీజర్‌లో..ప్రభాస్ క్యారెక్టర్ ఎలివేషన్ ఇస్తూ టైగర్, చీతా, ఎలిఫాంట్ అంటూ డైనోసార్ డైలాగ్ చెప్పిన తాత గుర్తున్నాడా? ఆయనే ఈ ఫోటో కనిపిస్తున్న వ్యక్తి. ఇతని పేరు టిన్నూ ఆనంద్ (tinnu anand). ఈయన సలార్‌తో చెప్పిన డైలాగ్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ డైలాగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పారు టిన్నూ. ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ (prashant neel) ఈ డైలాగ్ రాసారో.. టిన్నూ డైలాగ్‌ను పాష్ ఇంగ్లీష్‌లో నీట్‌గా చెప్పడం స్టార్ట్ చేసాడట. దాంతో ప్రశాంత్ నీల్‌కి ఒళ్లుమండి.. సర్… మీ ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్‌ని ఇంట్లో పెట్టండి. మనకు కావాల్సింది నాటు ఇంగ్లీష్. రోడ్లపై గల్లీలో మాట్లాడేలా డైలాగ్ ఉండాలి అన్నాడట. అప్పుడు టిన్నూ తన డైలాగ్ డెలివరీని మార్చుకున్నారు. (salaar)
ఇక ప్రశాంత్ నీల్ గురించి టిన్నూ మాట్లాడుతూ.. “” ప్రశాంత్‌కు ఏం కావాలో యాక్టర్‌కు నీట్‌గా వివరిస్తాడు. ఆ తర్వాత యాక్టర్ నుంచి తనకు కావాల్సింది వచ్చే వరకు నిద్రపోడు. అది ఎవరైనా సరే. ప్రభాస్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు. తనకు కావాల్సింది వచ్చే వరకు వదలడు. ప్రశాంత్‌లో నాకు నచ్చిన అంశం ఏంటంటే.. కెమెరా ముందు ఉండే యాక్టరే కాదు.. ఆ యాక్టర్ వెనక నిలబడే వ్యక్తులు కూడా సరైన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి. నేను డైనోసార్ డైలాగ్ చెప్తున్నప్పుడు నా చుట్టూ 200 మంది ఉన్నారు. వారికి కూడా ఇలా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి అలా షాక్ అవ్వాలి అని ప్రతి ఒక్కరినీ అబ్సర్వ్ చేసి మరీ సీన్ ఓకే చేసాడు ప్రశాంత్ “” అని తెలిపారు టిన్నూ.