Salaar: 4 వారాల‌కే OTTలోకి..?

Salaar: రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) న‌టించిన స‌లార్ సినిమా రిలీజైన నాలుగు వారాల‌కే OTTలోకి వ‌చ్చేస్తోందా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే చ‌ర్చ‌గా మారింది. బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న స‌లార్ అప్పుడే OTTలోకి వ‌చ్చేయ‌డ‌మేంటి? అయితే ఇందులో ఎలాంటి నిజం లేద‌ని టీం స్ప‌ష్టం చేసేసింది. బుద్ధున్న‌వాడు ఎవ్వ‌డూ ఇంత‌టి పెద్ద సినిమాను రిలీజ్ అయిన నాలుగు వారాల్లోనే రిలీజ్ చేసుకోరు అని తెలిపారు. ఇక సలార్ పార్ట్ 1 రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.