Devara: అదిగో భైర..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) న‌టిస్తున్న దేవ‌ర (devara) సినిమా నుంచి ఈరోజు అదిరిపోయే అప్డేట్ వ‌చ్చింది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ (saif ali khan) విల‌న్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సైఫ్ క్యారెక్ట‌ర్ పేరు భైర‌. ఈరోజు ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఫస్ట్‌లుక్‌తో స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది దేవ‌ర టీం. తార‌క్ లుక్ రివీల్ చేస్తూ.. హ్యాపీ బ‌ర్త్‌డే సైఫ్ స‌ర్ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇందులో సైఫ్ లుక్ మాత్రం సినిమాపై అంచ‌నాలు పెంచేలా ఉంది.