Sai Pallavi: తప్పుడు ఉద్దేశంతో అలా చేయడం బాధాకరం
ఫోటోను క్రాప్ చేసి పెళ్లి అయిపోయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు సాయి పల్లవి (sai pallavi). ఓ సినిమా లాంచ్‌లో భాగంగా సాయి పల్లవితో పాటు ఆమె పక్కన ఉన్న వ్యక్తి పూలదండలు వేసుకుని ఫోటోలకు పోజులిచ్చారు. ఓ పనికిమాలిన నెటిజన్ ఆ ఫోటోను క్రాప్ చేసి సాయి పల్లవి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని ప్రేమకు రంగుతో పనిలేదంటూ ట్విటర్‌లో పోస్ట్ చేసాడు. దీనిపై ఆల్రెడీ తమిళ పబ్లిసిస్ట్‌లు క్లారిటీ ఇచ్చారు.
ఇలాంటి ఫోటోలను వైరల్ చేసేవారిపై సాయి పల్లవి కూడా స్పందించారు. “” నేను సాధారణంగా ఎలాంటి రూమర్స్ పట్టించుకోను. కానీ ఆ రూమర్స్‌తో నా ఫ్రెండ్స్ ఉంటే మాత్రం నేను కచ్చితంగా స్పందిస్తాను. నా తదుపరి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంలోని ఫోటోను క్రాప్ చేసి కావాలనే డబ్బుల కోసం వైరల్ చేస్తున్నారు. తప్పుడు ఉద్దేశాలతో ఇలాంటివి చేయడం బాధాకరం. నేను మంచి విషయాలను పంచుకోవాలని అనుకుంటున్న సమయంలో ఇలాంటి పనికిమాలిన విషయాలకు స్పందించాల్సి వస్తోంది “” అని మండిపడ్డారు సాయి పల్లవి.