Sai Durga Tej కొత్త ప్రయాణం..!
Sai Durga Tej: ఇటీవల తన పేరును సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గ తేజ్ అని మార్చుకున్నట్లు ప్రకటించిన మెగా హీరో.. ఇప్పుడు మరో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తన తల్లి విజయ దుర్గ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తులో చేయబోయే సినిమాలు ఈ నిర్మాణ సంస్థ నుంచే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సాయి దుర్గ తేజ్.. గాంజా శంకర్ (Gaanja Shankar) సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని.. ఇందుకు కారణం టైటిల్‌లో గాంజా అనే పేరు ఉండటం.. తెలంగాణకు చెందిన నార్కోటిక్స్ బృందం అధికారులు టీంకు నోటీసులు పంపడమే అని తెలుస్తోంది. దీనిపై ధరమ్ తేజ్ స్పందిస్తూ.. దీని గురించి తానూ చదివానని.. ఇప్పుడు సినిమా ఉందో లేదో తనకూ తెలీదని సెటైర్ ఇస్తున్నట్లు రిప్లై ఇచ్చారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం ఎక్కువ అయిపోతున్న నేపథ్యంలో అందులోనూ టాలీవుడ్‌కి చెందిన ఎందరో ప్రముఖులు కూడా ఇందులో ఇన్‌వాల్వ్ అయ్యి ఉన్న నేపథ్యంలో మళ్లీ డ్రగ్స్ గురించి సినిమాలు తీయడంపై నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టైటిల్‌లోనే గంజా అని ఉండడంపై వారు మండిపడుతున్నారు. సినిమా టైటిల్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసారు.
సినిమా టైటిల్‌ను మాత్రమే కాదు డ్రగ్స్‌కి సంబంధించిన ఎలాంటి అంశాలున్నా కూడా సినిమా ఆడదని నార్కోటిక్స్ బృందం నోటీసుల్లో పేర్కొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యాక్షన్ డ్రామాగా గాంజా శంకర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ కొన్ని రోజుల క్రితమే గాంజా శంకర్ టైటిల్‌ను రిలీజ్ చేసింది. అప్పుడే అందరికీ అర్థమైపోయింది ఇది డ్రగ్స్‌కి సంబంధించిన సినిమా అని. ఎవరో ఒకరి నుంచి ఏదో ఒక అభ్యంతరం వ్యక్తం అవుతుందని ఊహాగానాలు ముందూ ఊపందుకున్నాయి. ఊహించినట్లుగానే నార్కోటిక్స్ బృందం కన్ను గాంజా శంకర్‌పై పడింది.