Sai Dharam Tej: అల్లు అర్జున్, స్నేహా రెడ్డిని అన్‌ఫాలో చేసిన‌ సాయి ధ‌ర‌మ్ తేజ్

Sai Dharam Tej unfollows allu arjun and allu sneha reddy on social media

Sai Dharam Tej: సాయి ధ‌ర‌మ్ తేజ్.. అల్లు అర్జున్, ఆయ‌న భార్య అల్లు స్నేహా రెడ్డిల‌ను సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేవ‌లం అల్లు శిరీష్‌ని మాత్ర‌మే ఆయ‌న ఫాలో అవుతున్నారు. ఇందుకు కార‌ణం అంద‌రికీ తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అల్లు అర్జున జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కేవ‌లం ఒక ట్వీట్‌తో మ‌ద్ద‌తు ఇచ్చి.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత శిల్పా ర‌విచంద్ర కిశోర్ రెడ్డి కోసం మాత్రం నంద్యాల‌కు వెళ్లి మ‌రీ ప్ర‌చారం చేయ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. దీనిపై నాగ‌బాబు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ అల్లు అర్జున్‌పై ప‌రోక్షంగా ట్వీట్ చేసారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఆ ట్వీట్‌ను డిలీట్ చేసారు.

ఆ తర్వాత మొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత తొలిసారి త‌న అన్న చిరంజీవి ఇంటికి వెళ్లిన‌ప్పుడు మొత్తం కుటుంబ స‌భ్యులంతా అక్క‌డే ఉన్నారు. ప‌వ‌న్‌కు గ్రాండ్‌గా వెల్కం చెప్పారు. ఆ స‌మ‌యంలో కూడా అల్లు అర్జున్ కానీ అల్లు అర‌వింద్ కానీ క‌నిపించ‌లేదు. దాంతో ఆ రోజు అల్లు అర్జున్ తెలిసో తెలీకో చేసిన ప‌ని వ‌ల్ల కొణిదెల‌, అల్లు కుటుంబాల మ‌ధ్య విభేదాల‌ను తెచ్చిపెట్టిందనే చెప్పాలి.