Sai dharam tej: పెళ్లికి నో చెప్పిన సుప్రీం హీరో!
Hyderabad: ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్(sai dharam tej) ఇప్పుడే పెళ్లి వద్దు అనుకుంటున్నాడట. గత ఏడాది యాక్సిడెంట్ అయ్యి కొన్ని రోజుల పాటు మంచానికే పరిమితం అయిన ధరమ్ తేజ్‌కి ఇంట్లో వాళ్లు ఓ సంబంధం తెచ్చారట. యాక్సిడెంట్ అవడంతో ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయిందట. వేరే సంబంధం చూస్తామంటే.. ఇప్పుడే యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్నానని, పెళ్లి గురించి ఆలోచించుకోవడానికి టైం కావాలని అడిగాడట. ఈ విషయాన్ని ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సంయుక్త(samyukta) హీరోయిన్‌గా నటించింది.