Sai Dharam Tej: అంబ‌టి రాంబాబుకి కౌంట‌ర్

Hyderabad: బ్రో (bro) సినిమాలో త‌న‌ను ఉద్దేశించి శ్యాం బాబు అనే క్యారెక్ట‌ర్‌ను పెట్టార‌ని ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు (ambati rambabu) ఆరోపిస్తున్నారు. దాంతో నిన్న ఆయ‌న ఓ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) గురించి కామెంట్స్ చేసారు. బ్రో (bro) సినిమాకు వ‌చ్చిన టోట‌ల్ క‌లెక్ష‌న్స్ కేవ‌లం రూ.60 కోట్లేన‌ని కావాల‌నే త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తున్నార‌ని అన్నారు. త్వ‌ర‌లో YSRCP ప‌వన్ వ్య‌క్తిగ‌త జీవితం, ఆయ‌న చేసుకున్న పెళ్లిళ్ల‌పై వెబ్ సిరీస్ తీయ‌నుందని వెట‌కారంగా మాట్లాడారు. దీనిపై సాయి ధ‌ర‌మ్ తేజ్ (sai dharam tej) స్పందించారు. సినిమాని సినిమా గానే చూడండి. అంబటి పై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్ తియ్యలేదు. సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టొద్దు అని కౌంట‌ర్ వేసారు.