Sai Dharam Tej: వివాదంలో ధ‌ర‌మ్ తేజ్

Hyderabad: న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ (sai dharam tej) వివాదంలో చిక్కుకున్నారు. ఈరోజు ఉద‌యం ఆయ‌న‌ శ్రీకాళ‌హ‌స్తి (srikalahasti) ద‌ర్శ‌నానికి వెళ్లారు. అయితే అక్క‌డ స్వామివారికి హార‌తి ఇచ్చారు ధ‌ర‌మ్ తేజ్. నిజానికి స్వామివారికి పూజారులు త‌ప్ప కామ‌న్ పీపుల్ ఎవ్వ‌రూ హార‌తులు ఇవ్వ‌కూడ‌ద‌ట‌. దాంతో భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు హార‌తికి ఎలా అనుమతి ఇచ్చారు అంటూ ఆలయ అధికారులపై భక్తులు అసహనం వ్య‌క్తం చేసారు. అయినా కూడా అధికారులు, సిబ్బంది ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.