Naga Chaitanya రెండో పెళ్లి..?
అక్కినేని నాగచైతన్య (naga chaitanya) రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు టాక్. సమంతతో (samantha) ఎనిమిదేళ్లు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న చై.. నాలుగేళ్లకే ఆమెతో వివాదాలు వచ్చి విడిపోయారు. అయితే ఇప్పుడు చైకి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఇంట్లో వారు అనుకుంటున్నారట. ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన అమ్మాయితో కాకుండా.. బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయినే కోడలిగా చేసుకోవాలని చై అమ్మ లక్ష్మి నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో చైకి సంబంధాలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
శోభిత జస్ట్ ఫ్రెండ్
కొంతకాలంగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల (sobhita dhulipala) డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మాత్రం చై స్పందిస్తూ శోభిత తన ఫ్రెండ్ మాత్రమేనని చెప్పాడు. తన విడాకులకు మూడో వ్యక్తితో ముడిపెట్టకండి అని రిక్వెస్ట్ చేసాడు. (naga chaitanya)