RRR: జపాన్​లో తగ్గని జోరు.. టైటానిక్​ రికార్డు బ్రేక్​!

Hyderabad: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రాం చరణ్ (Ramcharan) స్వతంత్ర సమర యోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకట్టుకుంది. జపాన్ మరియు అమెరికా దేశాల్లో ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా జపాన్ లో ఈ చిత్రానికి అనూహ్యమైన ప్రజాదరణ దక్కింది.

ఎన్టీఆర్, రాం చరణ్‌కు జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరూ నటించిన సినిమాలు జపాన్ లో విడుదలై అభిమానులను అలరించాయి. దీంతో వీరిద్దరూ కలిసి నటించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ బజ్ తో రిలీజ్ అయ్యింది. ఇక, సినిమా హిట్ కావడంతో జపాన్‌లోని థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ జపాన్‌లో 100 కోట్లు కలెక్ట్‌ చేసి ఆ మార్క్‌ ని అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

జపాన్ లో ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ విడుదలై 186 రోజులు గడిచింది. అయినా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ వారం ఆన్ లైన్ బుకింగ్స్ లో దూకుడు చూపించి టాప్ 10 లోకి తిరిగి వచ్చింది ఆర్‌‌ఆర్‌‌ఆర్. ఈ దూకుడు చూస్తుంటే జపాన్ బాక్సాఫీస్‌ వద్ద హయ్యెస్ట్‌ కలెక్షన్లు సాధించిన టైటానిక్ సినిమాను వెనక్కి నెట్టింది ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌. మరి జక్కన్న దర్శకత్వలో వచ్చిన ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్‌‌ అవార్డు (Oscar Award) గెలుచుకున్న సంగతి తెలిసిందే.