RRR: జపాన్లో తగ్గని క్రేజ్.. కాఫీలపై రామ్, భీమ్ బొమ్మలు!
Japan: దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) రూపొందించిన విజువల్ వండర్ RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన ఈ చిత్రం విడుదలై ఏడాది దాటినా ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం నాటు నాటు (Naatu Naatu) పాటకి ఆస్కార్ (Oscar) అందుకొని సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా జపాన్(Japan) బాక్స్ ఆఫీస్ వద్ద మరో రికార్డు క్రియేట్ చేసింది. జపాన్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఇంకా తగ్గట్లేదు.
ఈ చిత్రాన్ని గత ఏడాది అక్టోబర్ లో జపాన్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 44 నగరాల్లో 209 స్క్రీన్‌లు, 31 ఐమాక్స్ స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన RRR ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం 200 రోజులు పూర్తి చేసుకుంది. జపాన్ బాక్సాఫీస్ వద్ద ఈ ఘనత సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా RRR రికార్డు సృష్టించింది. జపాన్లో ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ మానియా తగ్గట్లేదు. జపాన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌కి ఫ్యాన్‌బేస్ కూడా ఏర్పడింది. తాజాగా ఎన్టీఆర్ బర్త్‌డేకి జపాన్లోనూ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. చాలామంది జపనీయులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఓ రెస్టారెంట్లో ఏకంగా రామ్, భీమ్ బొమ్మలను కాఫీలపై వేసి అందిస్తున్నారు. పలు ఆహార పదార్థాల పేర్లకూ ఆర్ఆర్ఆర్ పేరును జోడిస్తున్నారు. ఇక తాజాగా రామ్‌చరణ్ తమకు పుట్టబోయే బిడ్డకు జపాన్‌తో సంబంధం ఉందంటూ జపాన్‌పై అభిమానం చాటుకున్న విషయం తెలిసిందే.