RRR: 500 రోజులు.. 1288 కోట్లు..!

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి (rajamouli) తీసిన RRR సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా 500 రోజులు పూర్తి చేసుకుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr), మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (ram charan) న‌టించిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1288.40 కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా రాబ‌ట్టిన క‌లెక్ష‌న్లు 272.31 కోట్లు. జ‌పాన్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 133.50 కోట్లు రాబట్టింది. ఇక RRR సినిమాను రీ రిలీజ్ చేస్తే రూ.2.5 కోట్లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఇలా ఓవ‌రాల్‌గా సినిమా రాబ‌ట్టిన క‌లెక్ష‌న్లు రూ.1288.40 కోట్లు.